హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆఫీసులో మంగళవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ను ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్ కలిశారు. మందకృష్ణతో కలిసి ప్రవీణ్ డప్పు తో దరువు వేశారు. పద్మశ్రీ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.