బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తి హనుమాన్ మందిర్ లో ఏర్పాటు చేయనున్న శివలింగం, శివుని విగ్రహ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా మంగళవారం ముందు రోజు ఆలయం ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ముందస్తు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు.