1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యమకారులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లిలో 1969 ఉద్యమకారుల సమావేశం లో వారు మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో మొదటి దశ ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు జాగేటి బాపు, జంజీరాల రాజం, ఇతర ఉద్యమకారులు, మృతి చెందిన ఉద్యమకారుల పిల్లలు పాల్గొన్నారు.