లయన్స్ క్లబ్ శ్రీ శక్తి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పదో వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత పాల్గొన్నారు. వార్డు మహిళలు వివిధ రంగులతో చూడ చక్కని ముగ్గులు వేసి వీక్షకులను అలరించారు. అనంతరం పోటీల విజేతలకు లయన్స్ క్లబ్ శ్రీ శక్తి సభ్య చేతుల మీదుగా బహుమతులు అందించారు.