బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విమాన ప్రమాద మృతుల ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం నివాళులర్పించారు. విమాన ప్రమాద దుర్ఘటనలో ప్రయాణికులు మృతి చెందడం చాలా బాధాకరమని అధ్యక్ష కార్యదర్శులు రాజన్న, నగేశ్ పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ మృతుల కుటుంబాలకు అండగా ఉండి, ధైర్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.