సింగరేణి కాలనీలో కరెంటు తొలగింపు విషయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై బురద జల్లితే ఊరుకునేది లేదని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే సింగరేణి వార్డుల్లో మార్చి 31 వరకు విద్యుత్ సరఫరా కోసం సీఎం డి, మందమర్రి జియంతో మాట్లాడారని చెప్పారు. బస్తీల్లో హోల్డర్ ఆఫ్ ప్రిమిసెస్ నంబర్లు తీసుకొని విద్యుత్ మీటర్లు బిగించుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.