బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక, దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు గొడిసెల శ్రీహరి మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు.