తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, పిడిఎస్ యూ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన బంద్ బెల్లంపల్లిలో విజయవంతమైంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.