బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ నుంచి బెల్లంపల్లి మీదుగా మంచిర్యాల వరకు ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జీఎం శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆ బస్సు సర్వీసును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సింగరేణి కార్మికులు, గోలేటి గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థతో మాట్లాడి బస్సును ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.