హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ హోంగార్డు సకినాల నారాయణ గురువారం గొల్లపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలోని ఆయన నివాసంలో శాంతి దీక్ష చేపట్టారు. తొలగించిన హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గుడ్ విల్ కింద పది లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.