బెల్లంపల్లి: ఫుడ్ పాయిజన్లకు నిరసనగా రేపు పాఠశాలల బంద్

59చూసినవారు
బెల్లంపల్లి: ఫుడ్ పాయిజన్లకు నిరసనగా రేపు పాఠశాలల బంద్
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో వరసగా ఫుడ్ పాయిజన్లకు నిరసనగా శనివారం ప్రభుత్వ పాఠశాల బంద్ కు పిలుపునిచ్చినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దాగం శ్రీకాంత్, పీడీఎస్యు రెడ్డి చరణ్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి ఎస్ఎఫ్ఐ కార్యాలయం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ యూ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ లో మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్