బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు బెల్లంపల్లి బస్తి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల సమీపంలోని వీధిలో మురుగునీరు అంతా దారిలోనే ప్రవహిస్తుండడంతో అక్కడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ దారిలో తాము ఎలా నడవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గతంలో మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.