బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వ్యాపారస్తులు శనివారం కాంటా చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రోడ్లపై కూరగాయల అమ్మకాలు కొనసాగించవద్దని డిమాండ్ చేశారు. రోడ్లపై అమ్మకాలు చేస్తుండడంతో మార్కెట్లోకి గిరాకులు రావడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.