బుచ్చయ్యపల్లి గ్రామంలో విశ్వహిందూ పరిషత్ బెల్లంపల్లి ప్రఖండ కార్యదర్శి మిట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఖండ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మిట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ యువత దేశ భక్తి, దైవ భక్తి కలిగి హిందూత్వ పరిరక్షణకై పాటుపడాలని సమాజంలో హిందువుల పైన జరుగుతున్న పలు సందర్భాలను వివరించారు. రానున్న రోజుల్లో యువకులు, ప్రజలు అందరు దేశ శ్రేయస్సు కొరకు పనిచేయాలని పిలుపునిచ్చారు.