బెల్లంపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తోడే వంశీకృష్ణారెడ్డి స్మారకార్ధం గురువారం వేమనపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వంశీకృష్ణారెడ్డి సోదరుడు ఎన్నారై తోడె వెంకట కృష్ణారెడ్డి సహకారంతో విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ తెలిపారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ఇబ్బందులు కలగకుండా మారుమూల గ్రామాల ప్రాంతాల వారికి దుప్పట్లు పంపిణీ చేసినట్లు వివరించారు.