కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి చేపట్టిన పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామ శాఖ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ శాఖ నూతన కార్యదర్శిగా తిరుమలేశ్, సహాయ కార్యదర్శిగా కుమార్, కోశాధికారిగా మహేశ్ను ఎన్నుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.