విద్యుదాఘాతంతో నాలుగు పశువులు మృతి

70చూసినవారు
విద్యుదాఘాతంతో నాలుగు పశువులు మృతి
వేమనపల్లి మండలంలోని మంగనపల్లి పంట పొలాల్లో మంగళవారం విద్యుదాఘాతంతో నాలుగు పశువులు మృతి చెందాయి. మేత కోసం పొలాల వైపు వెళ్ళిన పశువులు తిరుగు ప్రయాణంలో పోశిరెడ్డి అనే రైతు పొలం వద్ద తెగిపడిన విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో షాకు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఘటన స్థలాన్ని జూనియర్ లైన్ మెన్ ఉదయ్ కుమార్ పరిశీలించారు. నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్