మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ గవర్నమెంట్ పార్టీ మేనేజర్ ఆనంద్ కులకర్ణిని తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకులు ఎండి ఉస్మాన్ పాషా ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పరిశ్రమ అభివృద్ధి కార్మికుల కష్ట సుఖాల్లో పాల్గొంటున్న ఆనంద్ కులకర్ని ను సోషల్ మీడియా ద్వారా పరిచయమై శనివారం స్వయంగా వెళ్లి ఆయనను కలవడం చాలా ఆనందంగా ఉందని ఉస్మాన్ పాషా అన్నారు. త్వరలో కంపెనీలో పనిచేసే కార్మికులకు తాజ్ బాబా సేవ సమితి ఆధ్వర్యంలో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ హెచ్ ఆర్ ఆనంద్ కులకర్ణి గారి సహకారంతో' మెగా ఉచిత కంటి పరీక్షలు 'నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు త్వరలో తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.