బెల్లంపల్లి పట్టణంలో వర్షం దంచి కొడుతోంది. ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి వాతావరం చల్లగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పెద్ద ఎత్తున కురుస్తుంది. దీంతో పట్టణ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లలేక టీవీలకు అతుక్కుపోయారు.