కన్నెపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి పఠనా సామర్థ్యాన్ని పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సంబంధిత సిబ్బందికి ఆయన సూచించారు. కోడిగుడ్ల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ ను తొలగించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.