కన్నెపల్లి మండల కేంద్రం మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. కనీసం మరమ్మత్తులు కూడా నోచుకోలేని దుస్థితిలో రోడ్లు ఉన్నాయని, రోడ్డు పక్కన ముల్ల పొదలు రోడ్డు మీదకు విస్తరించి ప్రమాదాలకు గురవుతున్నామనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముల్ల పొదలు తొలగించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని జరిగే ప్రమాదాలను నివారించాలని మంగళవారం ప్రజలు కోరుకుంటున్నారు.