కన్నెపల్లి: ఇంట్లో నిల్వ ఉన్న పీడీఎస్ బియ్యం.. ఇద్దరిపై కేసు

53చూసినవారు
కన్నెపల్లి: ఇంట్లో నిల్వ ఉన్న పీడీఎస్ బియ్యం.. ఇద్దరిపై కేసు
జంగంపల్లిలో పెద్దింటి వెంకటేశం ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయనే పక్కా సమాచారంతో ఎస్సై గంగారాం పోలీసు సిబ్బందితో వెళ్లి తనిఖీ నిర్వహించగా మూడు క్వింటాళ్ల యాభై కిలోల రేషన్ బియ్యం దొరికాయి. అవి ఎక్కడివి అని విచారించగా సుర్జాపూర్ కు చెందిన ఇందూరి లక్ష్మణ్ తన ఇంట్లో నిల్వ ఉంచాడని తెలిపాడు. దాంతో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్