తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల అధ్యక్షులు చిలుక రాజ నర్సు, కుంభాల రాజేష్, నాయకులు మల్లారపు చినరాజం, చిలుముల శంకర్, రత్నం ఐలయ్య, గోమాస రాజం, మిట్టపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.