ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి

53చూసినవారు
ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి
పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని మంచిర్యాల డిసిపి భాస్కర్ అన్నారు. దేవాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన బెల్లంపల్లి ఎసిపి రవికుమార్, మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, ఆంజనేయులతో కలిసి మొక్కలు నాటారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదారులతో మర్యాదగా మాట్లాడి ఫ్రెండ్లీ పోలీసులను కొనసాగించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్