కన్నెపల్లి మండల కేంద్రంలో ని ఆటో స్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు ఇరుకుగా మారింది. అనుమతులు లేని షాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టి రోడ్డు మీదకు వచ్చాయి. రోడ్డు ఇరుకు కావడంతో పెద్ద వాహనాలు ఎదురెదురుగా వస్తే వెళ్లలేని పరిస్థితి. సోమవారం సంత సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అక్రమ నిర్మాణాలను తొలగించి వాహనాదారుల సమస్యను తొలగించాలని, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.