
ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్లోనే
యాపిల్ సంస్థ భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దీని ఉత్పత్తి విలువ $22 బిలియన్లకు చేరింది. గత ఏడాదితో పోల్చితే 60% పెరిగిందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్లోనే తయారవుతోంది. 2024-25లో భారత్ నుంచి సుమారు $17.4 బిలియన్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయని భారత్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.