గంజాయితో నలుగురు యువకులను పట్టుకున్నట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ ఆదివారం తెలిపారు. కొందరు యువకులు జెండా వెంకటాపూర్ స్మశాన వాటిక వద్ద గంజాయి సేవిస్తున్నారని అందిన పక్కా సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి లభించిందన్నారు. గంజాయితో పాటు వారి నుంచి ఒక బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని వివరించారు.