నెన్నెల మండలం కేంద్రంలో నిర్మాణం చేపడుతున్న రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పరిశీలించారు. కృష్ణ పల్లి రోడ్డు చౌరస్తా నుంచి కోనంపేట రోడ్డు చౌరస్తా వరకు సీసీ రోడ్డు పనులను ఇటీవల ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గత వారం రోజులుగా సాగుతున్న పనులను వారు పరిశీలించారు.