బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత అధ్యక్షతన బుధవారం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండా అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో టాయిలెట్ నిర్మాణం, మార్కెట్ ఆవరణలో వర్షం నీరు నిలువకుండా షెడ్డు నిర్మాణానికి కు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.