రేపు బెల్లంపల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

70చూసినవారు
రేపు బెల్లంపల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ మల్లయ్య తెలిపారు. చెట్ల కత్తిరింపు పనుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు కాల్ టెక్స్ ఏరియా, హౌసింగ్ బోర్డ్, పెద్దనపల్లి, ఎఎంసీ ఏరియా, నంబర్ 2 ఇంక్లైన్, సుభాష్ నగర్, అంబేద్కర్ రడగంబాల బస్తి, 65 డిపి ఏరియా, శాంతిగని, బెల్లంపల్లి బస్తి మార్కెట్ ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్