సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య అన్నారు. కాసిపేట 1వ గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్ కు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. లాభాల వాటాను 35 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం, హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ కృషి చేస్తుందన్నారు.