బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఆసుపత్రిని కాపాడుకోవాలని గురువారం సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏరియా ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రి పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.