తాండూర్: నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

51చూసినవారు
తాండూర్: నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
తాండూర్ మండలంలోని బోయపల్లిలో 18 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బోయపల్లికి చెందిన మాసాడి రవి తన వ్యవసాయ భూమిలో వేసేందుకు మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తీసుకువస్తున్నాడు. సమాచారం మేరకు బోయపల్లి సమీపంలో బుధవారం పోలీసులు దాడి చేయగా విత్తనాలు పట్టుబడ్డాయి. వ్యవసాయ అధికారి సుష్మ పర్యవేక్షణలో పంచనామ నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్