తాండూర్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారి జాన్ తెలిపారు. బెల్లంపల్లి 132 కెవి/33 కెవి సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా తాండూరు మండలంలోని రేచిని, తాండూర్ సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఉదయం 11: 30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 30 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.