
గ్రామ, వార్డు సచివాలయాలను గ్రూపులుగా విభజన
AP: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను 7,715 గ్రూపులుగా ప్రభుత్వం విభజించింది. సచివాలయాల పరిధిలోని జనాభాను బట్టి ఇంజినీరింగ్/ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్వో/సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం తప్పకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే సాగు పరిస్థితిని బట్టి అగ్రికల్చర్ అసిస్టెంట్లలో ఒకరిని, వెటర్నరీ అసిస్టెంట్లలో ఒకరిని నియమించనున్నారు.