బెల్లంపల్లి పాత జిఎం కార్యాలయం నుంచి భూదా గెస్ట్ హౌస్ వెళ్లే రహదారి గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి గుంతల మయంగా మారింది. గుంతలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ దారి గుండా బెల్లంపల్లి నుంచి పెద్దబూద, చంద్రవెల్లి తదితర గ్రామాలకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మత్తు చేయాలని ప్రజలు గురువారం కోరుతున్నారు.