కేజీబీవీ వేమనపల్లి యందు ఇంటర్లో ఎం ఎల్ టి బోధన చేయుటకు పూర్తి తాత్కాలిక పద్ధతిలో అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ మయూరి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఎంఎల్ టి ఆంగ్లంలో బోధించేందుకు అనుభవం కలిగిన ఉపాధ్యాయురాలు కావాలని పేర్కొన్నారు. ఈ నెల 10, 11 తేదీల యందు అర్హత అనుభవం పత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కొరకు కేజీబీవి సంప్రదించాలని కోరారు.