గ్రామాల్లో ఎవరు ఎవరు కూడా గుడుంబా విక్రయించవద్దని, తయారు చేయవద్దని నిల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ హెచ్చరించారు. మంగళవారం వేమనపల్లి మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గుడుంబా విక్రయిస్తున్న చిడం సమ్మక్క, కొర్తె చంద్రకకు పుష్పగుచ్చాలు అందించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం గ్రామంలో యువకులతో కలిసి గుడుంబాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.