ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద జిల్లా ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు రామ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్ల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నెలకు 10, 000, ఇల్లులేని వారికి ఇల్లు ఇవ్వాలని కోరారు.