మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎస్పి కార్యాలయంలో డిప్యూటీ ఐజి అంకిత్ గోయల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి సిపి శ్రీనివాస్ హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర ఎన్నికల దృష్ట్యా మావోయిస్టు కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.