అటవీ ప్రాంతంలో జీవించే కోతులకు ఇతర అటవీ జంతువులకు రహదారులపై ఆహారం వేయడంతో ఆకలి తీర్చుకోవడానికి వాహనాలకు ఎదురుగా వచ్చి చనిపోతున్నాయని అలా చేస్తే వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని మంచిర్యాల ఎఫ్డిఓ సర్వేశ్వర్ అన్నారు. భీమారం అటవీ ప్రాంతంలోని జాతీయ రహదారిపై వాహనాలు ఆపి కోతులకు ఆహారం ఇస్తున్న బండి ఓదెలు అనే వ్యక్తికి 3, 000 జరిమానా విధించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.