భీమారం మండల కేంద్రానికి చెందిన ఆవుల ఓదెలు (43) ఈనెల గత నెల 23న మద్యం మత్తులో పురుగుమందును శీతల పానీయంలో కలుపుకొని తాగినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఓదెలుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.