హైదరాబాద్ లో శనివారం జరిగిన తెలంగాణ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ దివంగత వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి సంస్మరణ సభకు కోటపల్లి మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు ఆసంపెల్లి సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిచంద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శనిగరపు సుమన్, దామెర సంతోష్, సుంకరి రాజు, కామెర పవన్, చకినారపు అజయ్ పాల్గొన్నారు.