కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, కత్తెరసాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు.