చెన్నూరు ఎమ్మెల్యే గనుల కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవాస్తవాలైన ఆరోపణలు చేస్తూ నిరంతరం అవాకులు చవాకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఊరుకునేది లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామచందర్ హెచ్చరించారు. చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి గడ్డం వివేక్ అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడని హయాంలో అవినీతి జరగనివ్వడని తెలిపారు.