అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని ఉపాధి, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను ఆదివారం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి అందజేశారు. మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు రానివారు నిరుత్సాహపడవద్దని సూచించారు.