తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే డా. జి. వివేక్ వెంకటస్వామి కలిశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ శ్రేయోభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.