బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పుట్టినరోజు వేడుకలను బుధవారం చెన్నూరులో ఘనంగా జరుపుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్ హాజరై అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ కు పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు.