గాంధీ వర్ధంతి సందర్భంగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి గురువారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ అహింస మార్గం ద్వారా వలస వాదుల చెర నుండి భారతావనికి విముక్తి కలిగించిన జాతి పిత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మహిళ నాయకురాలు నాగుల శారద, రాజేశ్వరి, పుష్ప, సునీత పాల్గొనడం జరిగినది.