చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలపై పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ అర్చన అధ్యక్షతన బుధవారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. కమిషనర్ తీరుపై పలువురు సభ్యులు నిలదీయడంతో సమావేశంలో రసాభాస చోటుచేసుకున్నది. పాలకవర్గంతో సంబంధం లేకుండా ఇష్ట రీతినా పలు నిర్ణయాలు తీసుకుంటండంపై సభ్యులు ప్రశ్నించారు.